Bengaluru | ప్రధాని మోదీ తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్త వందే భారత్ ట్రైన్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడు మనం ఈ ట్రైన్ (Train) టైమింగ్స్, టికెట్ ధర, స్టాప్స్ వంటి విషయాలను తెలుసుకుందాం. ఇంకా అదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బస్ (Bus) టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? జర్నీ ఎంత టైమ్ పడుతుంది? వంటి అంశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. తద్వారా ఈ రెండు ఐటీ హబ్స్ మధ్య బస్ జర్నీ, వందే భారత్ ట్రైన్ జర్నీలలో ఏది అనుకూలమే చూద్దాం.

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఛార్జీల వివరాలు చూస్తే కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య చైర్ కార్ టికెట్‌కు రూ.1600, ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌కు రూ.2915 చెల్లించాలి. ఇందులోనే కేటరింగ్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.419 కాగా, చైర్ కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.364. ఇక యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి కాచిగూడ మధ్య ఛార్జీలు చూస్తే ఏసీ చైర్ కార్‌కు రూ.1540, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌కు రూ.2865 చెల్లించాలి. ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.369 కాగా, చైర్ కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.308.

పదేళ్లలో 2000 శాతం పెరిగిన ఎల్‌టీ ఫుడ్స్ స్టాక్‌!

కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు టైమింగ్స్ చూస్తే 20704 నెంబర్ గల రైలు తెల్లవారుజామున 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరితే మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. 20704 నెంబర్ గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ జంక్షన్‌లో బయల్దేరితే రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటల్లో కవర్ చేస్తుంది. దారిలో మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, ఢోన్, అనంతపూర్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. వందే భారత్ రైలులో ప్రయాణిస్తే రైల్వే ప్రయాణికులకు సుమారు 3.30 గంటల సమయం ఆదా అవుతుంది.

బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఈ చార్జీలు తెలుసుకోండి!

ఇకపోతే టీఎస్ ఆర్‌టీసీ బస్ జర్నీ విషయానికి వస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బస్ టికెట్ ధర రూ. 780 నుంచి ప్రారంభం అవుతోంది. సూపర్ లగ్జరీకి ఈ టికెట్ రేటు ఉంది. అదే గరుడ ప్లస్ బస్‌లో అయితే టికెట్ ధర రూ.890 నుంచి ప్రారంభం అవుతోంది. లహరి ఏసీ స్లీపర్ బస్ అయితే టికెట్ ధర రూ. 1420 నుంచి ఉంది. చాలా వరకు బసులు రాత్రి పూట ఉన్నాయి. కొన్ని బస్‌లు ఉదయం నుంచి కూడా సర్వీసులు కలిగి ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి బస్‌లు స్టార్ట్ అవుతున్నాయి. కానీ రాత్రి పూట ఎక్కువ బస్ సర్వీసులు ఉన్నాయి. జర్నీ టైమ్ దాదాపు 9 గంటల నుంచి 10 గంటలు పడుతుంది. అంటే ట్రైన్‌తో పోలిస్తే ఒక గంట జర్నీ ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్, త్వరగా వెళ్లాలని భావించే వారికి వందే భారత్ అనువుగా ఉంటుంది. ఇక తక్కువ టికెట్ ధర కోరుకునే వారు బస్‌లో వెళ్లొచ్చు.

First published:

Tags: Bengaluru, Hyderabad, Pm modi, Train, Vande Bharat Train


#General